శరవేగంగా 'బాహుబలి' నిర్మాణం
బాహుబలి. ఈ సినిమా నిర్మాణదశలోనే
ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని
పెంచుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమాకు ఇంతటి ప్రచారం జరుగలేదు. గత ఏడాది
ప్రారంభించిన ఈ సినిమా నిర్మాణం ఈ
ఏడాది చివరికి గానీ పూర్తికాదు. అయినా
శరవేగంగా షూటింగ్ జరుగుతోందిన
యూనిట్ వారు చెబుతున్నారు. అంటే ఈ
మూవీని ఏ స్థాయిలో నిర్మిస్తున్నారో
అర్ధం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్ తో
నిర్మించే ఈ చిత్రంపై
సినీపరిశ్రమతోపాటు ప్రేక్షకులకు కూడా
భారీ అంచనాలు ఉన్నాయి. దర్శక
దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి, అందులో
నటించే తారల వల్లే దీనిపై విపరీతంగా
ప్రచారం జరుగుతోంది. జక్కన్న నిర్మించే
పద్దతులు - ప్రభాస్ - అనుష్క, రాణా..
వీరందరూ ఈ చిత్రం కోసం ప్రత్యేక
శిక్షణ పొందడం, వారు పడే శ్రమతో భారీ
ఊహాగానాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ
చిత్రం విడుదలకు ముందే అనేక
సంచలనాలు, రికార్డులు సృష్టిస్తోంది.
ఇంతకు ముందు వివిద ప్రదేశాలలో జరిగిన ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్ లోనే శరవేగంతో జరుగుతోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాజమౌళి ఓ యజ్ఞంలా దీనిని హాలీవుడ్ స్థాయిలో
రూపొందిస్తున్నారు. నిర్మాతలు ఈ
చిత్రాన్ని వచ్చే ఏడాది దక్షిణాది భాషలైన
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతో
పాటు హిందీ, ఇంకా పలు భాషల్లో
ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న
తలంపుతో ఉన్నారు. సినిమా షూటింగ్
ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి
ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఎక్కువ
సమయం తీసుకుని రూపొందుతున్న
తెలుగు చిత్రం బాహుబలిగా
పేర్కొంటున్నారు. షోషియో ఫాంటసీగా
తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా
చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని
సంపాదించుకుంటుందని అంటున్నారు.
రాజమౌళితోపాటు ఇందులో నటించేవారందరికీ
పేరుప్రఖ్యాతులు సంపాదించిపెడుతుందని
భావిస్తున్నారు.
బాహుబలి. ఈ సినిమా నిర్మాణదశలోనే
ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని
పెంచుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమాకు ఇంతటి ప్రచారం జరుగలేదు. గత ఏడాది
ప్రారంభించిన ఈ సినిమా నిర్మాణం ఈ
ఏడాది చివరికి గానీ పూర్తికాదు. అయినా
శరవేగంగా షూటింగ్ జరుగుతోందిన
యూనిట్ వారు చెబుతున్నారు. అంటే ఈ
మూవీని ఏ స్థాయిలో నిర్మిస్తున్నారో
అర్ధం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్ తో
నిర్మించే ఈ చిత్రంపై
సినీపరిశ్రమతోపాటు ప్రేక్షకులకు కూడా
భారీ అంచనాలు ఉన్నాయి. దర్శక
దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి, అందులో
నటించే తారల వల్లే దీనిపై విపరీతంగా
ప్రచారం జరుగుతోంది. జక్కన్న నిర్మించే
పద్దతులు - ప్రభాస్ - అనుష్క, రాణా..
వీరందరూ ఈ చిత్రం కోసం ప్రత్యేక
శిక్షణ పొందడం, వారు పడే శ్రమతో భారీ
ఊహాగానాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ
చిత్రం విడుదలకు ముందే అనేక
సంచలనాలు, రికార్డులు సృష్టిస్తోంది.
ఇంతకు ముందు వివిద ప్రదేశాలలో జరిగిన ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్ లోనే శరవేగంతో జరుగుతోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాజమౌళి ఓ యజ్ఞంలా దీనిని హాలీవుడ్ స్థాయిలో
రూపొందిస్తున్నారు. నిర్మాతలు ఈ
చిత్రాన్ని వచ్చే ఏడాది దక్షిణాది భాషలైన
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతో
పాటు హిందీ, ఇంకా పలు భాషల్లో
ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న
తలంపుతో ఉన్నారు. సినిమా షూటింగ్
ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి
ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఎక్కువ
సమయం తీసుకుని రూపొందుతున్న
తెలుగు చిత్రం బాహుబలిగా
పేర్కొంటున్నారు. షోషియో ఫాంటసీగా
తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా
చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని
సంపాదించుకుంటుందని అంటున్నారు.
రాజమౌళితోపాటు ఇందులో నటించేవారందరికీ
పేరుప్రఖ్యాతులు సంపాదించిపెడుతుందని
భావిస్తున్నారు.
0 comments:
Post a Comment