Thursday, 17 July 2014

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో అవమానం జరిగింది. కొంతమంది కావాలని పవన్ ని తక్కువ చేసి తమ కసి తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటోని మార్ఫింగ్ చేసి ''శిఖండి '' అనే పేరు తగిలించి అవమాన కరమైన రీతిలో వ్యాఖ్యానాలు చేసారు. ఈ వ్యాఖ్యానాలు చూసిన పవర్ స్టార్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎవరు ఇలా చేసింది ,ఎందుకు చేసారు అనే కోణంలో వాళ్ళను గురించి తెలుసుకోవడానికి పవన్ అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి -బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం తో కొంతమంది ఇలా కావాలని చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

0 comments:

Post a Comment