దర్శకమౌళి రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వస్తోన్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదలకు రెడీ అవుతోంది. వందకోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాత్రకు తమన్నా జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, తమన్నాజంటపై సాంగ్ చిత్రీకరణకి ప్రస్తుతం సన్నాహాలు జరగుతున్నాయి. ఆర్కా మీడియా బ్యానర్ పై యార్లగడ్డ శోభా, ప్రసాద్ దేవినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment